లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గురువారం లోక్సభలో ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె కొట్టి పారేశారు. లలిత్ మెదీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాటు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలన్నారు.