తాగి నడిపితే.. తాట తీస్తారు! | Hyderabad Police Ready to Take Serious Actions on Drunken Drivers | Sakshi
Sakshi News home page

Jul 18 2016 7:25 AM | Updated on Mar 22 2024 11:22 AM

మద్యం తాగి వాహనం నడిపే మందు బాబులకు దెబ్బకు ‘కిక్కు’దిగే చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కేవారితో పాటు వారి కుటుంబసభ్యులకు కలిపి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. వారు చదివే విద్యా సంస్థకు, ఉద్యోగం చేసే సంస్థకూ ఈ సమాచారం ఇవ్వనున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామకాల సంస్థలకు ‘మందు బాబుల’ జాబితా అందించనున్నారు. మొత్తంగా ‘డ్రంకెన్ డ్రైవర్ల’లో పరివర్తన తీసుకురావడానికి.. రోడ్డు ప్రమాదాల నిరోధానికి చర్యలు చేపడుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు విభాగం పలు కఠిన చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement