పవిత్ర విజయదశమి రోజున, అందులోనూ నవరాత్రి పూర్ణాహుతి రోజున తనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగిందని, ఆయన చరణాల సన్నిధిలో ఆశీర్వచనం దొరికిందని, ఇందుకు తాను ఎంతగానో ఆనందపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక గుర్తింపు ఉంటే.. ఆధ్యాత్మిక దేశంగా మరో గుర్తింపు ఉందని చెప్పారు