మద్యం మత్తులో ఓ మహిళా పారిశ్రామికవేత్త గత అర్థరాత్రి హల్చల్ సృష్టించింది. అతిగా మద్యం సేవించడమే కాకుండా అధిక వేగంతో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న మూడు కార్లు, బైకును ఢీ కొట్టింది. దాంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితురాలు మహిళ పారిశ్రామికవేత్తను స్థానికులు పట్టుకుని ఓల్డ్ అల్వాల్ పోలీసులకు అప్పగించారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. ఆదివారం ఆమెను పోలీసులు విచారించనున్నారు. సోమవారం ఆమెను కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఆమె కారు ఏపీ 10 ఏఏ 8511ను పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. మహిళ అతిగా మద్యం సేవించిందని తమ పరీక్షల్లో తెలిందని పోలీసులు వెల్లడించారు.