స్వేచ్ఛకు, శాంతికి చిహ్నమైన తెల్లటి పావురాలను తమ సంబరాల కోసం కాంగ్రెస్ నాయకులు చంపేశారు. పావురాలను తారాజువ్వలో ఉంచి నిప్పుపెట్టి వినోదం చూశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం ఈ ఘటన జరిగింది. కొవ్వూరు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి దగ్గర రఘువీరాకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు.