దేశ రాజధాని.. ఉదయంపూట.. మరో ఘోరం! ఓ రాక్షసుడు అమ్మాయిని అతి కిరాతకంగా చంపేశాడు!! వెంట తెచ్చుకున్న కత్తెరతో రెండున్నర నిమిషాల్లో ఏకంగా 22 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. వాడు అలా దాడి చేస్తున్న సమయంలో చుట్టూరా జనం ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వారిలో ఒక్కరు ధైర్యం చేసినా ఆ అమ్మాయి బతికేదేమో పాపం!! ఆ ఉన్మాది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు కావడం గమనార్హం. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో క్లిప్ మీడియా, సోషల్ మీడియాలో విసృ్తతంగా ప్రచారం కావడంతో కేంద్రం కదిలింది. ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది