ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెళ్లవలసి వస్తే ముందుగా కేసీఆరే హైదరాబాద్ను విడిచి వెళ్లాలని ఆయన అన్నారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల ప్రజుల వారు నివసిస్తున్నారని, స్వార్థ రాజకీయాల కోసం సెటిలర్ల జీవితాలతో ఆటలాడుకోవద్దని దానం ఈ సందర్భంగా కేసీఆర్కు హితవు పలికారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకుంటే హైదరాబాద్పై పునరాలోచిస్తామని దానం అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని ఆయన తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన కేసీఆర్ వలసవాది అని దానం వ్యాఖ్యానించారు. తెలంగాణ రావటం కేసీఆర్కు ఇష్టం లేకే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన ఘటన కాంగ్రెస్కు దక్కటంతో ఆయన సహించలేకపోతున్నారన్నారు. సీమాంధ్రులు సోనియా, రాహుల్ను విమర్శిస్తే సహించేది లేదని దానం హెచ్చరించారు. విగ్రహాల విధ్వంసాలను ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆంధ్ర ప్రభుత్వం పని చేయాలంటే, ఇక్కడ పని చేస్తోన్న ఆ ప్రాంత ఉద్యోగులు వెళ్లక తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Aug 3 2013 11:19 AM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement