కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ గ్యాస్ దోపిడిపై తమ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ స్ఫష్టం చేశారు. కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ చేస్తున్న దోపిడిపై సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆయన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ, యూపీఏ సర్కార్లు తోడుదొంగల్లా వ్యవహారిస్తున్నాయని ఆరోపించారు. నిన్నటివరకు గ్యాస్ ఉత్పత్తిలేదని చెప్పిన రిలయన్స్ సంస్థ చమురు కంపెనీ ధరలు పెంచడంతో ఒకేసారి పెంచడంతో మాటమార్చిందని నారాయణ ఆక్షేపించారు. చమురుసంస్థల అక్రమాలపై త్వరలో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇంకా అలానే కొనసాగుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యూపీఏ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. పార్టీలోని వారందరిని ఓకేతాటిపైకి తీసుకురాలేని కాంగ్రెస్పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తుందని నారాయణ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
Jul 15 2013 3:13 PM | Updated on Mar 21 2024 9:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement