సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు | couple injured in gas cylinder blast in krishna district | Sakshi
Sakshi News home page

Nov 10 2013 3:13 PM | Updated on Mar 21 2024 11:24 AM

ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి కృష్ణాజిల్లాలో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. నందిగామ మండలం కేతవీరునిపాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లి పుష్పలత గ్యాస్‌ లీకేజీని గమనించకుండా స్టౌ వెలిగించడంతో అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో పుష్పలతతో పాటు భర్త వెంకటేశ్వర్లకు గాయాలయ్యాయి. పుష్పలత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త వెంకటేశ్వర్లు పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement