రాష్ట్రాలు విడిపోయినా రాష్ట్ర విభజన చిక్కులు వీడటం లేదు. తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులకు గదుల కేటాయింపు గందరగోళానికి దారి తీసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ టీఆర్‌ఎస్ ఎల్పీకి కేటాయించిన గదులనే ఆంధ్రపద్రేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు కేటాయించటం జరిగింది. దాంతో ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించటంతో వివాదం నెలకొంది. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో ఆయా రాజకీయ పార్టీలకు కార్యాలయాలను కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి సదారాం శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. సీఎల్పీ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీకి, టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌ను సీఎల్పీకి కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించనున్నారు.
Jul 18 2014 1:41 PM | Updated on Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement