ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు మరోసారి రాజ్యసభలో దుమారాన్ని లేపింది. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ సోమవారం సభలో బిల్లు అంశాన్ని సభలో ప్రస్తావించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బిల్లు రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు.