పెట్టుబడులతో తరలిరండి | come-up-with-investments-kcr-calls-industrialists | Sakshi
Sakshi News home page

Aug 22 2014 7:38 AM | Updated on Mar 21 2024 8:18 PM

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు. గురువారం సింగపూర్‌లో సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతికి తావు లేకుండా (జీరో కరప్షన్) పరిపాలిస్తాం. తెలంగాణలో ఐటీ రంగానికి మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ఇతర పరిశ్రమలతో పాటు ఫార్మాస్యూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాల్లో అభివృద్ధి మా ప్రాధాన్యత. మా రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతారు. అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా దగ్గరుండి చూస్తారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందడం పరిశ్రమలకు ఒక హక్కుగా చేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ లోటు ఉంది. దానిని తీర్చే ప్రణాళికలు ఇప్పటికే తయారుచేశాం. రాబోయే ఐదారేళ్లల్లో ఏకంగా 8 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సింగపూర్ పర్యటన రెండో రోజైన గురువారం సీఎం బిజీబిజీగా గడిపారు. ఉదయం ఇక్కడి భారత హైకమిషనర్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం సీఐఐ సదస్సులో ప్రసంగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement