వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనాకు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి అంచనాలకు మించి ఆదరణ లభిస్తోంది. తమ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుతూ వివిధ ప్రాంతాల్లోని పారిశ్రామిక బృందాల నుంచి తెలంగాణ ప్రతినిధి బృందానికి ఆహ్వానాలు వెల్లువెత్తాయి. షెంఝెన్‌కు చెందిన ‘చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీసీపీఐటీ)’ అధ్యక్షుడు జినేడ్ యే ప్రత్యేకంగా కేసీఆర్‌కు లేఖ రాశారు. తమ ప్రాంతాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న షెంఝెన్ ప్రావిన్స్‌లోని కంపెనీలు తెలంగాణ వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు.
Sep 9 2015 6:49 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement