‘ఓటుకు కోట్లు’ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆయన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ కుట్రలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏసీబీ స్పష్టంగా వివరించింది. చంద్రబాబు చెబితేనే తాము వచ్చామని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ స్పష్టం చేసినట్లు పేర్కొంది.