ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం కోర్టు వాయిదాకు గైర్హాజరు అయ్యారు. దాంతో ఏసీబీ కోర్టు సీరియర్ అయింది. ఆగస్టు 3న వాయిదాకు రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ రాలేకపోతున్నట్లు రేవంత్ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే సరే వాయిదాకు రేవంత్ రెడ్డి కచ్చితంగా హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహా కోర్టుకు హాజరు అయ్యారు. 'ఓటుకు కోట్లు' కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తన నియోజకవర్గం కొడంగల్ దాటి బయటకు రాకూడదని, ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులు స్వాధీనం చేయడంతోపాటు రూ.5లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే
Jul 13 2015 12:19 PM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement
