కాల్ మనీ' సెక్సె రాకెట్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టబోమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. బెదిరింపులకు పాల్పడితే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించకపోతే మహిళలను చెరబట్టడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.