'వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరింది' | Sakshi
Sakshi News home page

'వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరింది'

Published Wed, Apr 1 2015 8:21 PM

నూతన రాజధానికి 'అమరావతి' పేరును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధానికి వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరిందన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. చారిత్రక విశిష్టతలను కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేశామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంద్రుడు పాలించిన నగరంగా పురాణాలు చెబుతున్నాయన్నారు. పంచారామాలలో ఒకటైన అమరావతిని కేంద్రప్రభుత్వం హెరిటేజ్ సిటీగా గుర్తించిందని చంద్రబాబు తెలిపారు. ఒకటో శతాబ్దంలో ధాన్యకటకం పేరుతో అమరావతిని శాతవాహనులు రాజధానిగా చేసుకొని పాలించారన్నారు. రాజా వాసిరెడ్డి 18 వ శతాబ్దంలో అమరావతిని రాజధానిగా చేసుకొని ఉత్తమ పరిపాలన అందించారని చెప్పారు. అంతే కాకుండా బౌద్ధమతం తోనూ అమరావతికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు.

Advertisement
Advertisement