: ఏపీ రాజధాని కోసం బలవంతంపు భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ భూముల్లోకి వెళ్లేందుకు రైతులకు అవాంతరాలు సృష్టించొద్దని స్పష్టం చేసింది. రైతుల తరఫున హైకోర్టు న్యాయివాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.