అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి (27) దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ రెడ్డి మరణించాడని ఆతడి కుటుంబ సభ్యులు శనివారం వెల్లడించారు. తమ కుమారుడు అభిషేక్‌రెడ్డి (27) అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎమ్మెస్సీ చేస్తున్నాడని అతడి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మజా శనివారం తెలిపారు. అభిషేక్ తన సోదరి ప్రియాంకతో కలసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడని చెప్పారు.