యశోదకు చేరుకున్న 'గుండె' ! | a-live-heart-being-airlifted-from-bengaluru-to-hyderabad | Sakshi
Sakshi News home page

Feb 28 2015 5:11 PM | Updated on Mar 21 2024 10:40 AM

అప్పుడు బెంగళూరు....ఇప్పుడు హైదరాబాద్. భాగ్యనగరం మరోసారి గుండెమార్పిడికి వేదిక కాబోతోంది. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ఓ మహిళకు అమర్చాల్సిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్సులో నేరుగా ఆస్పత్రికి గుండెను చేర్చారు. ఇందుకోసం ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. కేవలం మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 45 ఏళ్ల మహిళకు ఈ గుండెను అమర్చనున్నారు. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ గుండెమార్పిడి జరగనుంది. షోలాపూర్ కు చెందిన రోజువారి కూలి చేసుకునే వ్యక్తి రెండు రోజుల క్రితం కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో అతన్ని చికిత్స నిమిత్తం పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిలో చేర్చారు. అయితే రోగికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. దీనితో మృతుని బంధువులు అవయవదానానికి అంగీకరించారు. అంతే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గుండెను తరలించారు. కాగా హైదరాబాద్ లో గుండె మార్పిడి జరిగింది. అప్పట్లో అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement