నకిలీ పాస్‌పుస్తకాల గుట్టురట్టు | 17 Thousand Fake Land Pass books Captured In Anantapoor | Sakshi
Sakshi News home page

Jul 5 2015 1:23 PM | Updated on Mar 21 2024 7:46 PM

నకిలీ పాస్‌పుస్తకాల గుట్టురట్టయింది. అనంతపురంలో నకిలీ పాస్‌పుస్తకాలను చెలమణి చేస్తున్న 12 మందిముఠాను బత్తలపల్లి పోలీసులు ఆదవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.13 లక్షల విలువ చేసే 17,100 నకిలీ పట్టదారు పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్ టాపులు, వేట కొడవలి, స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టుల పోలీసులు తెలిపారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్వో జగన్ మోహన్ రెడ్డితో సహా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. మరో ముగ్గురు వీఆర్వో పాత్రపై కూడా విచారణ చేపట్టామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఈ రాకెట్ వెనక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement