ఐయామ్ బ్లైండ్ : రాజా ది గ్రేట్ | Ravi Teja Raja the Great Teaser | Sakshi
Sakshi News home page

ఐయామ్ బ్లైండ్ : రాజా ది గ్రేట్

Aug 15 2017 10:23 AM | Updated on Mar 22 2024 11:03 AM

మాస్ మ‌హరాజా ర‌వితేజ లాంగ్ గ్యాప్ తరువాత నటిస్తున్న సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ తో పాటు ట‌చ్ చేసి చూడు సినిమాల్లో నటిస్తున్నాడు.టీజర్ లో మాస్ మాహ‌రాజ్ త‌న‌దైన స్టైల్ లో కనిపించాడు. బ్లైండ్ క్యారెక్టర్ లోనే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచినట్టుగా కనిపిస్తోంది. ఐమామ్ ది బ్లైండ్.. బ‌ట్ ఐయామ్ ది ట్రైన్డ్ అంటూ ర‌వితేజ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను అక్టోబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement