దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మెర్సల్ తెలుగు వెర్షన్ 'అదిరింది'కి బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఈచిత్రం పలు సార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. తమిళం పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయాల్సి ఉండగా డబ్బింగ్ సమస్యతో విడుదల కాలేదు. అయితే తాజాగా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించినా బ్రేక్ పడింది.