ప్రముఖ సినీనటి జయసుధ భర్త, సినీ నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన సొంత కార్యాలయంలో నితిన్ కపూర్ (58) ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర, నితిన్ కపూర్ పొంత అన్నదమ్ములు. అయితే నితిన్ కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మాత్రం తెలియలేదు. 1985లో జయసుధను ఆయన వివాహం చేసుకున్నారు. వాళ్లకు నిహార్, శ్రేయన్ అనే ఇద్దరు కొడుకులున్నారు.