రూపాయి విలువ యుఎస్ డాలర్తో పోల్చితే పది నెలల గరిష్టస్థాయికి పడిపోయింది. ఈరోజు రూపాయి విలువ 31పైసలు పడిపోయి 62.33 రూపాయలకు తగ్గింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యుఎస్ డాలర్తో రూపాయి విలువను 62.2059గా నిర్ధారించింది. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 1091పాయింట్లు పడిపోయింది. నవంబరు 28న సెన్సెక్స్ 28,694 ఉండగా, ఈరోజు 27,602 కి పడిపోయింది. గత పది సెషన్లలో నిఫ్టీ 296 పాయింట్లు పడిపోయింది. గత నెల 28న నిఫ్టీ 8588 ఉండగా, ఈరోజు 8293కు పడిపోయింది.