ఎడతెగని అల్ట్రాటెక్‌ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ఎడతెగని అల్ట్రాటెక్‌ పంచాయితీ

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

సాక్షి టాస్క్‌ఫోర్సు : వైఎస్సార్‌ కడప జిల్లా చిలంకూరు ప్రాంతంలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నాలుగు రోజులుగా కూటమి శ్రేణులు శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమలోని సిమెంట్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నప్పటికీ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, జిల్లా యంత్రాంగం స్పందించక పోవడం పట్ల ఈ ప్రాంతంలోని కార్మిక వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పరిశ్రమతో ఏమాత్రం సంబధం లేని వ్యక్తులు శిబిరాన్ని ఏర్పాటు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ఎంతకు దిగిరాక పోవడంతో అసహనానికి గురైన కూటమి శ్రేణులు ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో బోధపడక పరిశ్రమలను నిర్బంధిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల వల్ల చాలామంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరస్థితి నెలకొంది. కార్మిక శాఖతో పాటు జిల్లా కలెక్టర్‌ , జిల్లా ఎస్పీ, ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించాల్సి ఉంది. కానీ అధికార పార్టీ నేతలు కావడంతో అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

స్పందించని జిల్లా అఽధికార

యంత్రాంగం

Advertisement
 
Advertisement
Advertisement