కమలాపురం వాసుల | - | Sakshi
Sakshi News home page

కమలాపురం వాసుల

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

కమలాపురం వాసుల కల నెరవేరేనా!

పనులకు పూజలు నిర్వహిస్తున్న అప్పటి

కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

కడప సిటీ: కమలాపురం నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం పట్టణ నడిబొడ్డునున్న రైల్వే గేటు స్థానికులకు తీవ్ర ఆటంకంగా మారింది. కమలాపురం పట్టణ జనాభానే కాకుండా మైదుకూరు, ఖాజీపేట మండలాల్లోని ఆయా గ్రామాలకు చేరుకోవాలనే వారికీ ఇక్కడి రైల్వే గేటు అంతరాయంగా మారుతూ వస్తోంది. ఇక్కడ ఆర్‌ఓబీ నిర్మాణం జరిగితే ఈ ఆటంకాలకు.. అంతరాయాలు తొలగినట్లే. తొలుత వైఎస్సార్‌ హయాంలోనే ఆర్‌ఓబీకి బీజం పడింది. కానీ, ఆయన మరణం తర్వాత ఈ విషయం అటకెక్కింది. ఆ తర్వాత 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి హోదాలో ఉన్న ఆదినారాయణరెడ్డి ఈ పనులకు భూమి పూజ చేశారు. కానీ పనులు శూన్యం. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఈ పనులకు భూమి పూజ చేశారు. ఆపై సాయిల్‌ టెస్టింగ్‌ పనులు జరిగేలా కృషి చేశారు. ఆలోపుగా ఎన్నికలు రావడంతో పనులు ముందుకు సాగకుండా కుంటుపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 25 శాతం పనులు జరగలేదన్న ఉద్దేశ్యంతో ఆ పనులను రద్దు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల ఎమ్మెల్యే పుత్తా చైతన్యతో కలిసి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి భూ మి పూజ చేశారు. ఇప్పటివరకు మూడు సార్లు భూమి పూజ చేసుకున్న ఆర్‌ఓబీకి ఈసారైనా మోక్షం వస్తుందా.. రాదా..అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

వైఎస్సార్‌ హయాంలో

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కమలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ)కి బీజం పడింది. అదే సమయంలో ఎర్రగుంట్ల ఆర్వోబీ నిర్మాణం చేపట్టడం ఆయన హయాంలోనే జరిగింది. కమలాపురం ఆర్వోబీ నిర్మాణంపై అప్పట్లో ‘ఇద్దరు ప్రధాన నేతలు’ కాంగ్రెస్‌లోనే ఉన్న నేపధ్యంలో ఒకరేమో ఊరి బయట ఆర్వోబీ నిర్మిస్తే కమలాపురం అభివృద్ధి చెందుతుందని, మరొకరేమో ఉన్నచోటనే ఆర్వోబీ నిర్మించాలని పట్టుబడ్డారు. చివరకు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న స్థానంలోనే ఆర్వోబీ నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. దురదృష్టవశాత్తు వైఎస్సార్‌ మరణించడంతో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో ఈ పనులు అటకెక్కాయి.

మంత్రి హోదాలో ఆది భూమి పూజ

2014–2019 టీడీపీ హయాంలో మంత్రి హోదాలో ఇదే ఆర్వోబీకి ప్రస్తుత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కానీ, చిత్తశుద్దిలేని నాటి కూటమి ప్రభుత్వం పను లు ప్రారంభించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆర్వోబీ పరిస్థితి తయారైంది. సమయం ఉన్నా కేవలం ఓటు బ్యాంకు కోసం హడావుడి చేశారన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

రూ. 39 కోట్లతో ఆర్వోబీ నిర్మాణం

కేంద్ర ప్రభుత్వ పథకమైనా సేతుబంధన్‌ పథకం ద్వారా ఈ ఆర్వోబీ నిర్మాణానికి రూ. 39 కోట్లు మంజూరైంది. ఆన్‌లైన్‌ టెండర్లలో ట్రిపుల్‌ ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఈ పనులను దక్కించుకుంది. గతనెల 31వ తేదిన కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డితో కలిసి రోడ్డు భవనాలశాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ ఆర్వోబీకి భూమి పూజ చేసి వెళ్లారు. ఆ రోజు కొంచెం హంగామా సృష్టించి, ఆ తర్వాత ఇప్పటివరకు పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు.

కమలాపురం ఆర్వోబీ నిర్మాణాలకు మోక్షం వచ్చేనా!

వైఎస్సార్‌ హయాంలోనే ఆర్వోబీకి బీజం

వైఎస్‌ జగన్‌ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి భూమి పూజ

ఎన్నికల కోడ్‌ కారణంగాముందుకు సాగని పనులు

మళ్లీ తాజాగా కూటమి మంత్రి జనార్దన్‌రెడ్డి భూమి పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement