కిడ్నీలపై డీహైడ్రేషన్ ప్రభావం
వేసవి కాలంలో డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతా యి. ఇన్‌ఫెక్షన్‌లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్‌లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు ను తగ్గించాలి. –డాక్టర్ దినేష్‌కుమార్‌రెడ్డి,
మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప.
తలకు టోపీ, రుమాలు వాడాలి. వేడిగాలి తగలకుండా చూసుకోవాలి.
గొడుగు వాడాలి. తెలుపు రంగు, పలచటి చేనేత వస్త్రాలను ధరించాలి.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండాలి.
శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇంటి నుంచి బైటకు వెళ్లే ముందు ఒక గ్లాసు మంచి నీరుతాగాలి. వీలైనన్ని సార్లు మంచి నీటిని తాగడం మంచిది.
ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు తాగాలి
తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరగిడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం వైద్యులను సంప్రదించాలి.


