నిధుల కోసం నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

నిధుల కోసం నిరీక్షణ

Jul 31 2025 8:38 AM | Updated on Jul 31 2025 8:38 AM

నిధుల కోసం నిరీక్షణ

నిధుల కోసం నిరీక్షణ

కాశినాయన : పంచాయతీలకు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించింది. కేంద్రం మంజూరు చేసిన ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలకు జమ చేయడం లేదు. రెండు విడతలుగా కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వినియోగించుకుంటూ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. దీంతో గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం పనులకు ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం వానా కాలం కావడంతో గ్రామాల్లో కాలువల్లో పూడికతీత, బ్లీచింగ్‌ చల్లించడంతోపాటు దోమల నివారణకు ఫాగింగ్‌ చేయడం వంటి పనులకు సైతం నిధులు లేని పరిస్థితి నెలకొందని గ్రామ పంచాయతీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కడప జిల్లాల్లో

802 గ్రామ పంచాయతీలు

ఉమ్మడి కడప జిల్లాలో 802 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్‌, మైనర్‌ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు ఏటా రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. సంవత్సరానికి మూడు సార్లు ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే రెండు విడతల్లో 802 గ్రామ పంచాయతీలకు రూ.98 కోట్లకుపైగా జిల్లాకు నిధులు మంజూరవుతాయి. ఈ నిధులను జనాభా ప్రాతిపదికను గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.910 కోట్లపైగా నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు నేటికీ గ్రామ పంచాయతీలకు అందలేదు. కేంద్రం మంజూరు చేసిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించి కాలయాపన చేస్తోందని సర్పంచ్‌లు వాపోతున్నారు.

పారిశుధ్యం అధ్వానం..

వర్షాకాలం అయినందు వల్ల గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. తాగునీటి బోర్లు రిపేరు చేసేందుకు నిధులు లేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తే గ్రామాల్లో తాగునీటి సమస్యతోపాటు కాలువల్లో

పూడికతీత పనులు, తాగునీటి పైపులైన్లు, బోర్ల రిపేరులకు వాడుకుంటారని సర్పంచ్‌లు అంటున్నారు.

ఫిబ్రవరిలో ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం

2026 ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా సర్పంచ్‌లు సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎదురు చూపులు

15వ ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడు పంచాయతీ ఖాతాల్లో జమ అవుతాయా అని గ్రామ సర్పంచ్‌లు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రూ.98 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఇప్పటికే పారిశుధ్యం, తాగునీటి అవసరాల కోసం సర్పంచ్‌లు తమ జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా అవసరాలను తీర్చుతున్నారు. పనులు చేయకపోతే జిల్లా స్థాయి అధికారులు టార్గెట్‌ చేస్తున్నారని, గత్యంతరం లేక కొందరు సర్పంచ్‌లు, కార్యదర్శులు వడ్డీలకు అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. ఎప్పుడు నిధులు మంజూరవుతాయో తెలయడం లేదని, వడ్డీలు మాత్రం కట్టాల్సి వస్తోందని కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

అందని 15వ ఆర్థిక సంఘం నిధులు

కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లింపు

7 నెలలుగా పంచాయతీ ఖాతాల్లో

జమ కాని నిధులు

ఫిబ్రవరితో ముగియనున్న

సర్పంచ్‌ల పదవీ కాలం

నిధులు మంజూరు కాకపోవడంతో

ఇబ్బందులు పడుతున్న సర్పంచులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement