
వైఎస్ జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ప్రభ
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆరోపించారు. కడపలో బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉందని, కానీ ప్రభుత్వం ఆయన భద్రతను గాలికొదిలేసిందన్నారు. వైఎస్ జగన్ పర్యటనలకు జనాన్ని రాకుండా అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులను వినియోగిస్తున్నారన్నారు. ఈనెల 31వ తేదీ నెల్లూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారని, ఈ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్దకు పది మంది మాత్రమే రావాలని, జైలులో ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి వద్దకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉందని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద 100 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అలాగే ఎవరైనా జనసమీకరణ చేసి నా, జగన్‌ను చూసేందుకు వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం అన్యాయమన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలాంటి దుష్ట సాంప్రదాయాన్నే కొనసాగించి ఉంటే చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటించేవారా...లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్‌కళ్యాణ్ వారాహి యాత్ర చేసేవారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాభిమానాన్ని బారికేడ్లు, చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకోలేరని హెచ్చరించారు. ఈ దుష్ట సంప్రదాయానికి ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారులు, నాయకుల వివరాలను యాప్ ద్వారా డిజిటల్ లైబ్రరీలో పొందుపరుస్తామని అంజద్‌బాషా తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య, రమేష్‌రెడ్డి, షఫీ, ఏ1 నాగరాజు, జమీల్ పాల్గొన్నారు.
బారికేడ్లు, చెక్‌పోస్టులు పెట్టి
ప్రజాభిమానాన్ని అడ్డుకోలేరు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలాగే చేసి ఉంటే బాబు, పవన్, లోకేష్ యాత్రలు చేసేవారా?
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా