కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని సూచనల మేరకు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ కడపలోని జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయ సేవా సదన్‌లో ‘సివిల్ మిస్‌లీనియస్ అప్పీల్స్ కేసులు’ తదితర అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్స్ఙు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సివిల్ మిస్‌లీనియస్ అప్పీల్స్ కేసులు, ఉచిత న్యాయ సహాయం, నిరుపేద పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు (సాతి), న్యాయ సలహాలు, గౌరవ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ పథకాలు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 మొదలగు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
ఆగస్టులో విశేష పూజలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడప శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు బుధవారం టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్ట ఆలయంలో ఆగస్టు 8న ఉదయం వరలక్ష్మి వ్రతం, 9న పౌర్ణమి సందర్భంగా ఉదయం శ్రీ సీతారాముల కల్యాణం, 23 నుంచి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో..
ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్యం, 9న శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామికి తిరుమంజనం, 18, 19, 20 తేదీలలో ఆలయంలో బాలాలయం, జీర్ణోద్ధరణ, 24న పుబ్బ నక్షత్రం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, గ్రామోత్సవం, 25న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారికి స్నపన తిరుమంజనం, ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు.
జెడ్పీటీసీ స్థానాలకు
ఐదు నామినేషన్ల దాఖలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మొదటిరోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మూడు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి రెండు చొప్పున మొత్తం ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
● ఇందులో పులివెందుల ప్రాదేశిక నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున తుమ్మలూరు అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా తుమ్మల హేమంత్‌రెడ్డి, తుమ్మల ఉమాదేవిలు నామినేషన్లు రిటర్నింగ్ అఽధికారికి సమర్పించారు.
● ఒంటిమిట్ట ప్రాదేశిక నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా రాటాల రామయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా పూల విజయభాస్కర్ నామినేషన్లు దాఖలు చేశారు.
జాతీయ స్థాయిలో కలికిరి సైనిక పాఠశాల విద్యార్థినుల ప్రతిభ
కలికిరి : తమిళనాడు రాష్ట్రం అమరావతినగర్ సైనిక పాఠశాలలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఆల్ ఇండియా సైనిక పాఠశాలల ఆటల పోటీలలో కలికిరి సైనిక పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. అండర్ 17 విభాగం హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచినట్లు కలికిరి పాఠశాల ప్రిన్సిపాల్ సీఎస్ పరదేశి తెలిపారు. హాకీ టీం బాలికలను ఆయన అభినందించారు.
సివిల్ మిస్‌లీనియస్ అప్పీల్స్‌పై న్యాయ విజ్ఞాన సదస్సు