దాతృత్వానికి పరిమితులు ఉంటాయి. దాతృత్వం వల్ల మాత్రమే పేదరికం పోదు. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకొచ్చినపుడే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది. కానీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు.
– ఎ.రామ్మోహన్‌రెడ్డి,
సీపీఎం కడప నగర కార్యదర్శి
పీ4 చంద్రబాబు ఆడుతున్న నాటకం
పీ4 పేరుతో పేదరికాన్ని రూపుమాపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు ప్రజలకు దశాబ్దాలుగా ఎన్నో సేవలు అందించింది. నేడు ఆ సంస్థ లైసెన్స్ రద్దును వ్యతిరేకిస్తూ సేవ్ ఆర్‌డీటీ ఉద్యమాన్ని ప్రజలే నిర్వహిస్తున్నారంటే ఆ సంస్థ సేవలను మనం అర్థం చేసుకోవచ్చు. సేవలు, దాతృత్వం వల్ల పేదరికం పోయేటట్లయితే అనంతపురం జిల్లాలో పేదరికం ఉండరాదు.
– జి.వలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐఎస్‌ఎఫ్
యువతకు ఉపాధి చూపాలి
జిల్లాలో నైపుణ్యం గల మానవ వనరులకు కొదవలేదు. పరిశ్రమలు తీసుకు రావడం వల్ల ఉపాధి లభిస్తుంది. అప్పుడు ఎవరి దాతృత్వంతో అవసరం ఉండదు. నాణ్యమైన విద్య, వైద్యం, నైపుణ్యాలు, ఉపాధి వంటి ప్రధాన అంశాలను విస్మరించి పీ4 పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మభ్యపెట్టాలని చూస్తున్నారు.
– దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ
ప్రజల దృష్టి మళ్లించేందుకే
ప్రజల దృష్టి మళ్లించేందుకే