పట్టాలెక్కని వారణాసి రైలు | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కని వారణాసి రైలు

Jul 30 2025 8:41 AM | Updated on Jul 30 2025 8:41 AM

పట్టా

పట్టాలెక్కని వారణాసి రైలు

రాజంపేట: ఒకప్పుడు కాశీకి పోతున్నారంటే.. ఇక తిరిగి రారేమో అన్న నానుడి ఉండేది. నేటి సామాజిక యుగంలో వాటిని కొట్టిపారేస్తూ.. కాశీకి చేరుకొని తిరిగి క్షేమంగా గమ్యానికి చేరుకునే రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అయితే రాయలసీమ జిల్లాల నుంచి వారణాసి(కాశీ) వెళ్లేందుకు రైల్వే వ్యవస్థ ఆవిర్భావం నుంచి ఒక్క రైలు కూడా నడిపించకపోడవం విచా రకరమని భక్తులు భావిస్తున్నారు. బీజేపీ పాలనలో కాశీకి రైలు వేయడం మరిచి పోయిందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్‌ రైల్వేస్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన అయినా అయోధ్య, వారణాసికి జిల్లా

మీదుగా తిరుపతి నుంచి రైలు నడిపించాలని యాత్రికులు, పర్యాటకులు కోరుతున్నారు.

తప్పని వ్యయ ప్రయాస:వారణాసికి వెళ్లేందుకు అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లా వాసులు కష్టాలు పడుతున్నారు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా వారణాసికి వెళ్లాలనుకుంటారు. అటువంటి వారి కోసం కనీ సం ప్రభుత్వ సాయం లేకపోయినా, రవాణా సౌకర్యం కల్పించకపోవడంపై భక్తులు పెదవి విరిస్తున్నారు. పితృదేవతల అస్థికలు గంగలో నిమజ్జనం చేయడానికి కాశీకి వెళుతుంటారు. వ్యయప్రయాలతో వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.

తిరుపతి నుంచి రైలు వేస్తే..

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి అయినా కడప, చిత్తూరు జిల్లాలను కలు పుతూ వారణాసికి డైరెక్ట్‌ ట్రైన్‌ను పట్టాలెక్కించలేకపోయారు. సీమ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు కాశీకి వెళ్లేందుకు డైరెక్ట్‌ ట్రై న్‌ను తీసుకొచ్చేలా రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు విన్నవిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండరామాలయం, దేవుని కడప, అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, నందలూరు సౌమ్యనాథాలయం, పుష్పగిరితోపాటు అతి ప్రాచీనమైన ఆలయాలకు ఉత్తరభారత్‌ దేశానికి చెందిన వారు రావడానికి ఈ రైలు అనుకూలమని, ఈ విషయాన్ని రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

అయోధ్యకు.. జిల్లా మీదుగా అయోధ్య, వారణాసికి రైలు నడిపితే తిరుపతి నుంచి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, కర్నూలు సిటి, కాచిగూడ, ప్రయోగరాజ్‌, వారణాసి మీదుగా అయోధ్య వరకు రైలు నడిపితే ఇటు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనంతోపాటు కాశీలోని శక్తిపీఠం, అయోధ్య బాలరాములను దర్శనం చేసుకునేందుకు వీలవుతుంది.

గూడూరు జంక్షనే దిక్కు..

సప్త మహాక్షేత్రాల్లో ప్రాధాన్యమైనది వారణాసి. వరుణ, అఖి నదుల కలియక ఫలితంగా విష్ణుమూర్తి, నారాయణునికి తొలి ఆలయంగా ఏర్పడిన పవిత్ర స్థలం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒక్కచోట ఉన్న క్షేత్రం. అన్నపూర్ణదేవి కొలువైన ప్రాంతం.. ఇలా వారణాసి ఎంతో ప్రాశస్త్యం చెందింది. ప్రతి హిందువు జీవితంలో ఒక్క సారైనా దర్శించి తరించాలనుకుంటారు. అటువంటి చోటికి అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల మీదుగా లు ఒక్కటీ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.

వారణాసికి డైరెక్ట్‌ బండి లేక ఇక్కట్లు

అంచెలంచెలుగా యాత్ర

గూడురు జంక్షనే దిక్కు

కడప మీదుగా నడపాలని డిమాండ్‌

వారణాసి వెళ్లడానికి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి గూడూరు మీదుగా వెళ్లే రైళ్లే అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లా వాసులకు దిక్కయింది. హైదరాబాద్‌ నుంచి కూడా వెళ్లే పరిస్థితులు నేడు ఉన్నాయి. మైసూరు నుంచి వారణాసికి ఒకే ఒక్క రైలు అనంతపురం జిల్లాలోని గుంతకల్‌ మీదుగా వెళుతుంది. అది నిండుగా ఉంటోంది. జనరల్‌, రిజ్వరేషన్‌ బోగీలు కిటకిటలాడుతుంటాయి. కడప, చిత్తూరు, కర్నూలు జిల్లా వాసులు అంచెలంచెలుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వారణాసికి ఎలా వెళ్లాలో అంతుపట్టడం లేదని భక్తులు వాపోతున్నారు. కాశీ ప్రయాణం సులభతరం చేసేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పట్టాలెక్కని వారణాసి రైలు1
1/1

పట్టాలెక్కని వారణాసి రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement