
● నేతల మాటలు నీటి మూటలు..
కొండెక్కిన ధరలు నేలకు దింపుతామంటూ ఎన్నికల్లో నేతల మాటల గారడీనీ తలపిస్తున్నాయి. సగటు మనిషి జీవన ప్రమాణాల్లో మార్పులు తెద్దామన్న చిత్తశుద్ధి ఏ నాయకుడికి లేకపోయింది. సంచి నిండా డబ్బు పట్టుకెళ్తే నిత్యావసర వస్తువులు,కూరగాయలు జేబు నిండా రావడం లేదు. బియ్యం ధర వింటే దెయ్యాన్ని చూసినంత భయమేస్తోంది. కాస్తో కూస్తో మంచి రకం బియ్యం కేజీ ఎనబై పై మాటే. కంది పప్పు మాట వింటే కలలో కూడా కెవ్వుమనాల్సి వస్తోంది. రూ.150 నుంచి రూ.175లు పలుకుతున్నాయి. పల్లీల మాట వింటేనే తల్లీ నీకో దండం అనాల్సిందే. మంచిరకం రూ.140 నుంచి రూ.160లు ఉన్నాయి.గ్యాస్ బండ ఎప్పుడో గుదిబండై కూర్చుంది. నేతల మాటలు అమలయ్యేదెప్పుడో!