
కూరగాయలను కొనలేకున్నాం
మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యం సామాన్యులు సైతం వాడుకునే టమోట, మిరపకాయలు ధరలు కూడా భగ్గుమంటున్నాయి. నిన్నామొన్నటి వరకు కిలో రూ. 10 ఉన్న టమోట రూ. 30 చేరింది. మిరపకాయలు 60 రూపాయలు ఉన్నాయి. దీంతో పచ్చడి మెతుకులు కూడా తినే పరిస్థితి కరువైయింది. – అంబటి రాజశేఖర్‌రెడ్డి,
ఆలంఖాన్‌పల్లి, కడప
ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు
బియ్యం,బ్యాలు,ఉద్ది పప్పు శనకాయపప్పులు చింతపండు ఎండుమిర్చి దేనిని ముట్టుకున్నా ధరలు కాలిపోతున్నాయి.ఏమి తిని బతకాలయ్యా.. రేట్లు ఇట్లా మండిపోతుంటే పట్టించుకునే వారు లేరు. కూరగాయలు పండే కాలంలోనే ఇలా రేట్లు మండిపోతుంటే వచ్చే ఎండాకాలం ఎలా ఉంటాయో తల్చుకుంటేనే భయమేస్తోంది. ధరలు తగ్గించే మార్గం చూడండయ్యా..
–సుబ్బమ్మ, గృహిణి, గాంధీనగర్, బద్వేలు
బెంగుళూరు నుంచి వచ్చే
కూరగాయలన్నీ ధర ఎక్కువే
బెంగుళూరు నుంచి వచ్చే కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటాయి. క్యారెట్,కాకరకాయలు,బీన్స్ ఒక రకం వంకాయలు,బోండామిర్చి, ఆలుగడ్డలు,తదితర కూరగాయలు బెంగుళూర్ నుంచి రావాల్సింది. ధరలెక్కువగా ఉండడం వల్ల సాయంత్రం వరకూ అమ్మినా మాకు వేయి రూపాయలు కూలి మిగలడం లేదు. పచ్చి సరుకు త్వరగా అమ్ముడుపోతేనే పదిరూపాయలు ఉంటాయి. లేకుంటే నష్టం తప్ప లాభం లేదు.
–సుబ్బరాయుడు,
కూరగాయల అంగడి యజమాని,బద్వేలు

కూరగాయలను కొనలేకున్నాం

కూరగాయలను కొనలేకున్నాం