ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి

Jun 17 2025 5:22 AM | Updated on Jun 17 2025 5:22 AM

ఫిర్యాదుదారులకు  న్యాయం చేయండి

ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి

కడప అర్బన్‌: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్‌ గ్రీవెన్‌న్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టం ) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీం, మహిళా పీఎస్‌ డీఎస్పీ బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement