హ త్య కేసులో నిందితుడి అరెస్టు
జమ్మలమడుగు రూరల్ : మండలం లోని ముద్దనూరు రహదారిలో ఈ నెల 18న హత్యకు గురైన చెన్నంశెట్టి మల్లికార్జున (32) కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ లింగప్ప వివరాల మేరకు.. చెన్నంశెట్టి మల్లిఖార్జున, అతడి భార్య సరోజ మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అంత కంటే ముందుగా సరోజతో గొడవపడిన భర్త చెన్నంశెట్టి మల్లిఖార్జున తన ఇంటి నుంచి గెంటివేశాడు. దీనిని దృష్టిలో పెట్టుకున్న సరోజ సోదరుడు వినోద్‌కుమార్ మల్లిఖార్జునపై ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నెల 18న బావ చెన్నంశెట్టి మల్లిఖార్జున జమ్మలమడుగుకు రావడంతో కొత్తరోడ్డు సమీపంలో వినోద్ తన కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్ట్‌లో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.


