స్తంభాన్ని ఢీకొని స్కూటరిస్టు మృతి
చాపాడు : మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని కొత్తపల్లె ప్రభుకుమార్(41) గురువారం మృతి చెందారు. మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన ప్రభుకుమార్ లింగాపురం వెళ్లి తిరిగి బైక్‌లో వస్తున్నారు. పల్లవోలు సమీపంలోని కాశినాయన వృద్ధాశ్రమ సమీపంలో ప్రమాదశాత్తూ బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రభుకుమార్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.
ఏపీఈఏపీ సెట్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్ : ఏపీఈఏపీ సెట్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా గురువారం 2526 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లా కడపలో ఐదు పరీక్షా కేంద్రాలు, పొద్దుటూరులో మూడు పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా 103 మంది గైర్హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 96.08 శాతం హాజరు నమోదైంది.
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
– పది ఎర్రచందనం దుంగల స్వాధీనం
కడప అర్బన్ : ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు డీఎఫ్‌ఓ వినీత్ కుమార్ తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో విలేకరులతో డీఎఫ్‌ఓ మాట్లాడుతూ కడప రేంజ్ మద్దిమడుగు ఈస్ట్ బీట్‌లోని చనులబల్లి బావి ప్రదేశంలో ఎర్ర చందనం రవాణా సాగుతోందని సమాచారం అందడంతో కడప ఎఫ్‌ఆర్‌ఓ కె.ప్రసాద్, సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేపట్టారని తెలిపారు. కొందరు తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలతో కనిపించడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారన్నారు. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన రామన్ ఆండీ పట్టుబడగా, మిగిలిన వ్యక్తులు పరారయ్యారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఉంచిన పది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు. తనిఖీల్లో పాల్గొన్న ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాద్‌తోపాటు, ఎస్.ఓబులేసు, షకీల్, కిషోర్, చౌడయ్య, నందిని, శోభారాణి,లను డీఎఫ్‌ఓ అభినందించారు.
స్తంభాన్ని ఢీకొని స్కూటరిస్టు మృతి


