అత్తమామలు, మరిది వేధింపులపై ఫిర్యాదు
ఎర్రగుంట్ల : తనను అత్త మామలు, మరిది వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలమల్ల పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ రమణ కథనం మేరకు.. కలమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని క్రిష్ణానగర్ కాలనీలో ఈశ్వరమ్మ అనే మహిళ నివాసముంటున్నారు. ఈమె భార్త నాగశేషయ్య మృతి చెందాడు. ఈశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే ఈశ్వరమ్మ మరిది గోపి ఆయన భార్య ఎలిషమ్మ, అత్తమామలు కలసి నిత్యం వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు మనస్తాపానికి గురై భయపడి ఇంటిలో మాత్రలు వేసుకుని పడిపోయింది. ఆమె కుమారుడు గమనించి వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించాడు. అక్కడ కోలుకున్న తర్వాత ఈశ్వరమ్మ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
గేటు డబ్బులు అడిగినందుకు ఘర్షణ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో లారీలు పార్కింగ్‌కు సంబంధించి గేటు నిర్వాహకులు గేటు డబ్బులు అడిగినందుకు లారీ డ్రైవర్లు శ్రీహరి, శ్రీనివాసులు గేటు నిర్వాహకులతో గొడవకు దిగారు. గేటు నిర్వాహకులు, లారీ డ్రైవర్ల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై ఫిర్యాదు
వల్లూరు (చెన్నూరు)/జమ్మలమడుగు రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ ప్రతినిధి చేబ్రోలు కిరణ్ కుమార్‌పై చెన్నూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, పార్టీ అనుబంధ విభాగ సభ్యులైన నిరంజన్‌రెడ్డి, దేవగుడి భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సురేష్ యాదవ్, అల్లి శ్రీరాములు, పార్టీ కార్యకర్తలు చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అలాగే జమ్మలమడుగుకు చెందిన వైఎస్సార్‌సీపీ కడప జిల్లా మునిసిపల్ విభాగం అధ్యక్షుడు వల్లంభాయి హృషికేశవరెడ్డి గురువారం జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రామక్రిష్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి, మునిసిపల్ కో ఆప్షన్ మెంబర్ ఫయాజ్ బాషా, రాష్ట్ర మేధావుల వర్గం నాయకుడు వేణుగోపాల్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి యోబు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, మైలవరం మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, తాజుద్దీన్, గాజ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, ఇతర మహిళా నేతలు కలిసి చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పార్టీలో అయినా మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు పత్తి రాజేశ్వరి, వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణవేణి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు యానాదయ్య, సీహెచ్ వినోద్‌కుమార్, మల్లికార్జున, ఇతర మహిళా నేతలు పాల్గొన్నారు.
అత్తమామలు, మరిది వేధింపులపై ఫిర్యాదు


