జమ్మలమడుగు : మైలవరం మండలం తలమంచిపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ జి.అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, సబ్ డివిజన్‌లో చోరీలు, ఇతర నేరాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌పై అవగాహన కల్పించి మహిళలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు జరగకుండా నిరోధించాలని సూచించారు. పోలీసులు గ్రామాలకు వెళ్లి ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసు కోవాల న్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు గోపాల్‌రెడ్డి, లింగప్ప ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


