రాజంపేట సెంటిమెంట్‌ ఎవరికో ! | Sakshi
Sakshi News home page

రాజంపేట సెంటిమెంట్‌ ఎవరికో !

Published Wed, May 15 2024 9:40 AM

-

గెలిచే అభ్యర్థిదే రాష్ట్రంలో అధికారం

సుదీర్ఘ కాలంగా ఆనవాయితీగా వస్తున్న వైనం

పోలింగ్‌ వైఎస్సార్‌సీపీ అనుకూలమేనన్న పరిశీలకులు

పీవీ.మిథున్‌రెడ్డి, ఆకేపాటికి గెలుపు పవనాలు

రాజంపేట : ఒకొక్క నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేకత. కొందరు నాయకులు గెలిచినా పార్టీలు ఓడిపోవడం, కొందరు ఓడినా.. మరిన్ని చోట్ల అదే పార్టీ అధికారంలో రావడం చూస్తుంటాం. కానీ రాజంపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏ పార్టీ అభ్యర్థి అయితే అక్కడ గెలుపొందుతాడో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 2024లో కూడా సెంటిమెంట్‌ ఎవరికో.. అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మెజార్టీ దిశగా...
పోలింగ్‌ సరళినిబట్టి ఎంపీ అభ్యర్ధి పీవీ.మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డిల గెలుపునకు అనుకూల పరిస్ధితులు ఏర్పడ్డాయని పరిశీలకులు అంచనాకు వచ్చారు. గత ఎన్నికల తరహాలోనే ఈ సెంటిమెంట్‌ దక్కే పరిస్ధితులున్నాయని పోలింగ్‌ సరళిని బట్టి రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మహిళల ఓటింగ్‌ భారీగా పెరగడంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడి సంక్షేమం గాలి వీసినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు.

1985 నుంచి ,...
గత 34 యేళ్లుగా నియోజకవర్గ పరిశీలనలోకి వెళితే..రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన పార్టీ అధికారంలోకి వస్తోంది. ఉభయ జిల్లా వ్యాప్తంగా ఈ నియోజకవర్గ అభ్యర్ధి గెలుపు వ్యవహారాలు ఆసక్తిని కలిగిస్తాయి. 1985 నుంచి గెలిచిన అభ్యర్థికి సంబంధించి పార్టీ అధికారం చేపడుతూ వస్తోంది. దాదాపు 34 యేళ్లుగా ఇక్కడ అభ్యర్థి గెలవడం, ఆ పార్టీ అధికారంలోకి రావడం చూసి జనం సంప్రదాయంగా భావిస్తున్నారు. ఏళ్ల చరిత్రలో ఇది కూడా ఓ మైలురాయిగానే చెప్పుకోవచ్చు. అనేకమంది అభ్యర్ధులు కూడా పోటీపడిన చరిత్రలు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి.

1985లో టీడీపీ తరుపున బీ.రత్నాసభాపతి, 1989లో కాంగ్రెస్‌ నుంచి కే.మదన్‌మోహన్‌రెడ్డి, 1994, 1999లో టీడీపీ అభ్యర్ధిగా పసుపులేటి బ్ర హ్మయ్య గెలుపొందారు. ఆ పార్టీ అధికారం చేపట్టింది. 2004లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది.

నాడు వైఎస్సార్‌ హయాంలో.. నేడు జగనన్న హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ, నేడు జగనన్న హయాంలోనూ రాజంపేట వైఎస్సార్‌సీపీ రాజ్యమేలుతోంది. 2004లో కొండూరు ప్రభావతమ్మ గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, డా.వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. 2009లో ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. మరోమారు వైఎస్సార్‌ సీఎం పీఠం అధిరోహించారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి 30వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. అప్పటి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో వైఎస్సార్‌సీపీ తరపున మేడామల్లికార్జునరెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలో సంప్రదాయం కొనసా వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించింది. వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్‌ కుటుంబానికి అగ్రపీఠం అందజేస్తున్న నియోజక వర్గంగా రాజంపేట చరిత్రలో నిలిచిపోయింది.

 

రాజంపేట సెంటిమెంట్‌ ఎవరికో !
1/2

రాజంపేట సెంటిమెంట్‌ ఎవరికో !

రాజంపేట సెంటిమెంట్‌ ఎవరికో !
2/2

రాజంపేట సెంటిమెంట్‌ ఎవరికో !

Advertisement
 
Advertisement
 
Advertisement