‘సర్’లో సందేహాలా..
పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన
పట్టభద్రుల ఓటరు నమోదు షెడ్యూల్
శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో తమ ఓటు ఉంటుందా పోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలతో హియరింగ్(విచారణ)కు హాజరుకావాల్సి ఉంటుందని ఓటర్లు ఆరా తీస్తున్నారు. ఓటర్ల సందేహాలకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి సమాధానాలు ఇవ్వనున్నారు.
సాక్షి, యాదాద్రి: రాచరిక నిరంకుశ పాలన సంకెళ్లను తెంచుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేసిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 17 అని, నాటి అమరుల పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి సుఖేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరులు, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ కాదని, అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, విముక్తి పోరాటానికి సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పరమావధి
ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయమే పరమావధిగా ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ఎల్‌నినో నేపథ్యంలో నీటి వినియోగం తక్కువగా ఉండే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అనంతరం ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 28 మంది విద్యార్థులను, విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన వివిధ శాఖలకు చెందిన 8 మంది ఉద్యోగులను సత్కరించారు. ఈ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
జెండాకు సెల్యూట్ చేస్తున్న మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్
విద్యార్థినుల నృత్య ప్రదర్శన
తేది. 19.09.2026
(శనివారం)
సమయం : ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు
డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ :
83319 97002
ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం విడుదల చేశారు. పీజీ 4వ సెమిస్టర్‌లో మొత్తం 1265 మంది విద్యార్థులకు 967 మంది, (76.44శాతం), బ్యాక్‌లాగ్‌లో మొదటి సెమిస్టర్‌లో 427 మంది విద్యార్థులకు 158 మంది (37శాతం), 2వ సెమిస్టర్‌లో 382 మందికి 65 మంది (17.02శాతం), 3వ సెమిస్టర్‌లో 34 మంది విద్యార్థులకు 168 మంది (48.84శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు సీఈఓ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను ఎంజీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు డి.సంధ్యారాణి, కళ్యాణి, ప్రవళిక పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడి మొదలు కానుంది. ఈ నియోజవర్గంలో ఓటరు జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 28వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వెంటనే నమోదు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 6వ తేదీ వరకు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉటుంది. నవంబర్ 20వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 10 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరించి, 25వ తేదీలోగా పరిష్కరిస్తారు. డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదైన వారు కూడా మళ్లీ కొత్తగా ఫారం–18 ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సిందే. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 2024 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎంత మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకుంటారో చూడాల్సిందే.
భూమిని మింగేస్తున్నారు!
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో విలువైన ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలకు రక్షణ లేకుండాపోయింది.
- 8లో
ఫ శాసన మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి
ఫ కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
ఫ 28న నోటిఫికేషన్
ఫ డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా
ఫ పాత ఓటర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందే..


