తూప్రాన్‌పేట అండర్‌పాస్‌ ప్రారంభానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

తూప్రాన్‌పేట అండర్‌పాస్‌ ప్రారంభానికి సిద్ధం

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

చౌటుప్పల్‌ : హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టిన తూప్రాన్‌పేట అండర్‌పాస్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుదిమెరుగులు మాత్రమే మిగిలాయి. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నందిగామ శివారు వరకు అధికారులు గుర్తించిన 17బ్లాక్‌స్పాట్‌లలో తూప్రాన్‌పేట బ్లాక్‌స్పాట్‌ ఒకటి. ఇక్కడ ప్రమాదాలను అరికట్టేందుకు గతేడాది ఈ అండర్‌పాస్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. బ్రిడ్జి పైభాగంలో పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌ మార్గంలో వాహనాలను అనుమతిస్తూ అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. బ్రిడ్జిపై వెలుతురు కోసం హైమాస్ట్‌ లైట్లను బిగించడమే కాకుండా, మధ్యలోని డివైడర్‌పై పటిష్టమైన ఇనుప కంచె (ఐరన్‌ బారికేడ్‌) ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది భాగంలో అండర్‌పాస్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే పూర్తిస్థాయి రాకపోకలు మొదలుకానున్నాయి. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జాతీయ రహదారి వాహనాలు పైనుంచి, స్థానిక మరియు చుట్టుపక్కల గ్రామాల వాహనాలు కింద ఉన్న సర్వీస్‌ రోడ్డు ద్వారా వెళ్తాయి.ఇదిలా ఉండగా మండలంలో మరో రెండు బ్లాక్‌స్పాట్లు అయిన ధర్మోజిగూడెం, చౌటుప్పల్‌ ప్రాంతాలలో మాత్రం పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement