మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పొనుగోటి మాధవరావు 100వ పుట్టినరోజు వేడుకలను బుధవారం ఆయన నివాసంలో గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మాధవరావు స్వాతంత్రోద్యమంలో, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. అంతేకాకుండా ఆయన మర్రిగూడకు మూడుసార్లు సర్పంచ్‌గా పనిచేసి అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఈ సందర్భంగా మాధవరావు కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పొనుగోటి విజయరామారావు, పందుల రాములుగౌడ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.


