సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

కనగల్‌ : కనగల్‌ మండలం తిమ్మన్నగూడెం సబ్‌స్టేషన్‌ ఎదుట బుధవారం సాయంత్రం రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాత్రివేళ కూడా విద్యుత్‌ కోతలు విధించడంతో పొలాలకు నీరు పారించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సమస్యను అధికారులకు తెలియజేసినప్పటికీ పరిష్కారం కాలేదని రైతులు వాపోయారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఏడీ శ్రీనివాస్‌, ఏఈ సుధాకర్‌, ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి సబ్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. గురువారం నుంచి విద్యుత్‌ కోతలు లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement