మా నాయకుని గురించి తెలుసుకోవాలని ఉంది | - | Sakshi
Sakshi News home page

మా నాయకుని గురించి తెలుసుకోవాలని ఉంది

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

మా నాయకుని గురించి తెలుసుకోవాలని ఉంది పాఠ్యాంశంగా చేర్చాలి చైతన్యం కలుగుతుంది

మాగ్రామం లో వీరుడు చింతలపురి రామిరెడ్డి విగ్రహం ఉంది. రజాకార్లకు వ్యతిరేకంగా ఆరోజు వీరోచిత పోరాటం చేసి అమరులయ్యారు. ఆయన సార్మకంగా మా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశామని మా పెద్దలు చెప్పారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్పనాయకుని గురించి తెలుసుకోవాలని ఉంది.

–దాసరి రాకేష్‌ రేణికుంట

రజాకార్ల సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు చింతలపురి రామిరెడ్డి. ఆయన గురించి భావి తరాలకు తెలియడానికి గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారు. పోరాటంలో ప్రాణాలు కూడా వదిలేశారని చెప్పారు.ఇలాంటి నాయకుని గురించి పా ఠ్యాంశాల్లో చేర్చి రేపటి తరాలకు భోదించాలి.

–బి. హేమంత్‌ కుమార్‌,

ఇంటర్‌ విద్యార్థి, రేణికుంట

గ్రామంలో పోరాట వీరుడు రామిరెడ్డి విగ్రహం చూస్తే మాలో చైతన్యం కలుగుతుంది. నిజాం మిలటరీకి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటంపై గ్రామంలో ఇప్పటికీ పాటలు పాడుతారు. కథలు కథలుగా చెబుతారు.

– బి. సంజీవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement