ఫ సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ కమిషనర్ వీణాధావన్
యాదగిరిగుట్ట: టీబీ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వీణాధావన్ వైద్య ఆరోగ్య సిబ్బందిని కోరారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పీహెచ్‌సీతో పాటు కాచారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాల వరకు దగ్గు, జ్వరం, తెమడలో రక్తం పడటం, ఛాతీలో నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, బరువు తగ్గడం, గ్రంధుల వాపు తదితర లక్షణాలు ఉంటే తప్పని సరిగా టీబీ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాచారంలో నిర్వహించిన టీబీ పరీక్షల్లో 152 మంది రోగులను పరీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, నేషనల్ టీబీ కన్సల్టెంట్స్ డాక్టర్ రాధారామ్, విఘ్నేశ్వర్, జిల్లా వైద్యాధికారి మనోహర్, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ వంశీకృష్ణ, డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌లు డాక్టర్ మహేష్, శ్రీఘన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావని, కొండం ఉపేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ బర్మ మౌనిక, సీహెచ్‌వో వెంకటయ్య, సిబ్బంది ఈశ్వర్ పాల్గొన్నారు.


