కేసీఆర్‌పై దుష్ప్రచారం మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై దుష్ప్రచారం మానుకోవాలి

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

సాక్షి, యాదాద్రి: కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేయడం హైకోర్టు తీర్పుతో నైనా మానుకోవాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలు హితవు పలికారు. గురువారం భువనగిరి పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పును వారు ఉదహరించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్‌ రెండున్నరేళ్లలో ఆరోపణలు రుజువు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. పీసీ ఘోష్‌ నివేదిక పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ స్క్రిప్ట్‌ అని పేర్కొన్నారు. కే సీఆర్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌లోకి వచ్చిన గోదావరి నీళ్లు ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పారుతున్నాయంటే అది కేసీఆర్‌ పుణ్యమే అని అన్నారు. మేడిగడ్డ వద్ద కూలిన రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతుల పొలాలకు నీరివ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలుబెడిసికొట్టాయన్నారు. పీసీసీఅథ్యక్షుడు కోర్టు తీర్పు స్పష్టంగా వచ్చినా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వెంటనే ఎన్నికలకు సిద్ధంకావాలన్నారు. కాళేశ్వరం వల్లే హైదరబాద్‌ నగరానికి మంచినీళ్లు ఇవ్వడానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలుచేస్తే గ్రామాల్లో జనం తరమికొడతారన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, కేశవపట్నంరమేష్‌, పెంట నర్సింహ, సుబ్బురు బీరుమల్లయ్య, రాంగోపాల్‌రెడ్డి, నాగారం సూరజ్‌, రేకల శ్రీనివాస్‌, పద్మ పాల్గొన్నారు.

ఫ హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి

ఫ ఆరోపణలు రుజువు చేయలేని కాంగ్రెస్‌

ఫ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement