భువనగిరి: ఏడాదంతా పుస్తకాలు, పరీక్షలతో గడిపిన విద్యార్థులకు శుక్రవారం నుంచి ఉపశమనం లభించనుంది. 2025–26 విద్యా సంవత్సరం గురవారంతో ముగిసింది. ముగింపు రోజు విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి అందజేశారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు రెండు మూడు రోజుల నుంచే సొంతగ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కాగా కొన్ని అద్దె బస్సులు నడుస్తున్నా అవి ఎప్పుడు వస్తాయో తెలియక తమ పిల్లలను బైకుల పైఐ తీసుకెళ్లారు. ఈ వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు ఉండనున్నాయి. తిరిగి పాఠశాలలు 2026–27 విద్యాసంవత్సరం జూన్ 12వ తేదీన పునః ప్రారంభంకానున్నాయి.
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
ఫ పుస్తకాలు పక్కన పెట్టి ఊర్లబాట పట్టిన పిల్లలు
ఫ ఇక ఆటాపాటలతో సందడి
ఫ జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం


