కోదాడరూరల్ : కోదాడ మండలంలోని చిమిర్యాలకు చెందిన లారీ డ్రైవర్ అదృశ్యమయ్యాడు. రూరల్ ఎస్సై గోపాల్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. వేముల శ్రీనివాస్ కోదాడ పట్టణంలోని శ్రీవీరాంజనేయ ట్రాన్స్‌పోర్టులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన లారీ డ్రైవింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. నాటి నుంచి అతని కోసం తెలిసిన వారిని, బంధువుల ఇళ్లలో, పలు ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు మణికుమార్ కోదాడ రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 86043 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.


